ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖి చేసిన ఎమ్మెల్యే

0

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖి చేసిన ఎమ్మెల్యే

BSBNEWS - గుడ్లూరు 


మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను సిబ్బంది హాజరు పట్టిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో వచ్చే రోగుల సంఖ్య వారికి అందుతున్న అందుతున్న వైద్య సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో మందుల విభాగాన్ని పరిశీలించి రోగులకు ఇస్తున్న మందులు వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని సీజన్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)