2 కోట్ల 70 లక్షలతో మండలంలో పూర్తయిన సిసి రోడ్లు నిర్మాణం.

0

2 కోట్ల 70 లక్షలతో మండలంలో పూర్తయిన సిసి రోడ్లు నిర్మాణం.

BSBNEWS - పొన్నలూరు 

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరంలోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, మాలపాడు గ్రామంలో ఎస్సీ కాలనీకి 70 లక్షలతో సిసి రోడ్డు పూర్తయిందని, పొన్నలూరు గ్రామంలో 45 లక్షలు, ఇప్పగుంట గ్రామంలో 20 లక్షలు, చౌటపాలెం గ్రామంలో 25 లక్షలు, చెరుకూరు గ్రామంలో 15 లక్షలు, నాగిరెడ్డి పాలెం ఎస్టీ కాలనీలో 20 లక్షలు, రావులకొల్లు ఎస్సీ కాలనీకి 25 లక్షలు, భోగనంపాడు గ్రామంలో 15 లక్షలు, బాలిరెడ్డిపాలెం గ్రామంలో 15 లక్షలు, వెంకుపాలెం గ్రామంలో 20 లక్షలు రూపాయలతో మండలంలోని పలు గ్రామాలలో ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయిందని, కొత్తగా మంజూరైన సీసీ రోడ్లు పనులు వెంకుపాలెం నుండి కే అగ్రహారం వరకు 5 కోట్ల రూపాయలతో, మాలపాడు గ్రామంలో 1 కోటి 50 లక్షలు, పొన్నలూరు గ్రామంలోని ఎస్టి హాస్టలకు 2 కోట్ల 50 లక్షలు, రావులకొల్లు ఎస్సీ కాలనీలో మంచినీటి ట్యాంకుకు 30 లక్షల రూపాయలు మంజూరు చేసినారని, మండలం మొత్తం మీద 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని, గత ప్రభుత్వంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం రోడ్లకు ఉన్న గుంతలు కూడా పూడ్చ లేదని ఆయన ఎద్దేవ చేశారు. దీనికి సంబంధించి ఎక్కడకొచ్చిన బహిరంగ చర్చలకు సిద్ధమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కర్ణ కోటిరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లపోతు ప్రసాద్, కె అగ్రహారం సర్పంచ్ షేక్ చిన్న మస్తాన్, మన్యం రమణయ్య, పల్లపోతు వెంకట్రావు, దాసరి కృష్ణారావు, మన్యం మల్లికార్జునరావు, ఎర్ర నరేంద్ర, లక్ష్మయ్య, సుబ్బారావు, లేళ్ల పల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)