మండలంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి ....

0

మండలంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి ....

BSBNEWS - పొన్నలూరు 

మండలంలో ముండ్లమూరి వారి పాలెం, చెరుకూరు, పొన్నలూరు, నాగిరెడ్డి పాలెం, ముత్తరాజుపాలెం వివిధ గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముండ్లమూరి వారి పాలెం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటుచేసిన అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద మండా మల్లికార్జున, దాతలు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున అన్న ప్రసాద వినియోగం జరిగింది. ముండ్లమూరు వారి పాలెం శ్రీ కోదండ రామాలయం ఎదుట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరుకూరు వీర ప్రతాప ఆంజనేయ స్వామి వద్ద మోదడుగు వంశీయుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి పూజా కార్యక్రమాల నిర్వహించారు. రెడ్డిపాలెం గ్రామంలో ఈ మధ్యన ఏర్పాటుచేసిన ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్తరాజుపాలెం వద్ద నవాంజయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం గ్రామ పెద్దలు నిర్వహించారు. పైరెడ్డిపాలెం విగ్రహాల వద్ద ఆయా గ్రామస్తులు భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అన్న ప్రసాద వినియోగం జరిగింది.

Post a Comment

0Comments
Post a Comment (0)