220 కె.వి సబ్ స్టేషన్ లో నూతన 100 ఎం వి ఏ ట్రాన్స్‌ఫార్మర్ భూమిపూజ
BSBNEWS - కందుకూరు
కందుకూరు పట్టణ పరిధిలోని దివివారిపాలెం గ్రామంలో 220 కె.వి సబ్ స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న 100 ఎం వి ఏ సామర్థ్యంతో కూడిన నూతన ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణానికి గురువారం ఉదయం 10:00 గంటలకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఇలాంటి 100ఎం వి ఏ అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతంలోని విద్యుత్ సరఫరా మరింత నాణ్యతగా, నిరవధికంగా అందించవచ్చునని తెలిపారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వ్యవసాయ పనులకు, గృహ వినియోగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయటానికి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి విద్యుత్ అధికారులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ అమీన్, సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు, సివిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధీర్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు, 220 కెవి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవితేజ పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య దివివారిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి నేతలు, మహిళలు పాల్గొన్నారు.


.jpeg)