కందుకూరులో ఓ లాడ్జిలోని పేకాట శిబిరం గుట్టురట్టు

0

కందుకూరులో ఓ లాడ్జిలోని పేకాట శిబిరం గుట్టురట్టు 

BSBNEWS - KANDUKUR 

పట్టణంలోని ఓ లాడ్జిలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో కందుకూరు పట్టణ ఎస్సై వి.సాంబశివరావు తన సిబ్బందితో శిబిరంపై దాడి చేసి 9 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 29,640 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ వి. సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. లాడ్జి యాజమాన్యంపై కేసు నమోదు  చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. పట్టణంలోని లాడ్జిలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. పట్టుకున్న జూదరులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పడుతున్నట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)