హనుమాన్ జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

0

హనుమాన్ జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి 

BSBNEWS - వలేటివారిపాలెం 

వలేటివారిపాలెం మండలం  వలేటివారిపాలెం పంచాయతీ లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ దక్షిణాముక శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి, సమృద్ధి కోసం హనుమంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా హనుమాన్ జయంతి సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి ఆలయ పండితులు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ పండితులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ లక్ష్మీ నరసింహాం, కాకుమాని ఆంజనేయులు,  కాకుమాని హర్ష, వలేటి మధు, పరిటాల భాస్కర్, గుత్తా కొండయ్య, వలేటి నరసింహం, గుత్తా మధు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

Post a Comment

0Comments
Post a Comment (0)