ఏం.డీ.యు వాహనాలు రద్దు చేయడం తగదు.

0

ఏం.డీ.యు వాహనాలు రద్దు చేయడం తగదు. 

BSBNEWS - కందుకూరు 

పేదల సంక్షేమాన్ని అడ్డుకోవడంలో భాగంగానే ఎం.డీ.యు వాహనాలు రద్దు చేయడం జరిగినదని మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ బుర్రా. మధుసూదన్ యాదవ్ అన్నారు. మాట్లాడుతూ  పేద ప్రజలకు ఇంటి వద్దనే రేషన్ అందించాలని మంచి సంకల్పంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఎం.డీ.యు వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. పేదలకు వైఎస్ జగన్ చేసిన ప్రతి మంచిని తుడిచివేయాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదని తీవ్రంగా విమర్శించారు. ఎం.డీ.యు వ్యవస్థ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికింది. కూటమి కుట్రపూరితంగా తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని ఎం.డీ.యు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు అని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 10000 కుటుంబాలు రోడ్డున పడతాయి. పేదలకు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులను అందించే చౌక దుకాణాలు మాదిరిగా ఉన్న ఎం.డీ.యు వ్యవస్థను రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల ముందరి అన్నం గిన్నెను లాగేసుకున్నట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమైనది. పేద ప్రజలు పనులు మానుకొని రేషన్ దుకాణాలకు వెళ్లి రేషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురిస్తుందని అన్నారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగించి లక్షలాదిమంది కుటుంబాలను కూడా వీధిన పడేసింది, విరే కాదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉన్న సహాయకులను కూడా తొలగించి వారి జీవనాధారం లేకుండా చేసింది. అంతేకాదు సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అందులో ఉన్న ఉద్యోగులను కూడా రేషనలైజేషన్ పేరుతో కుదించింది. మేం అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలంటూ ఓట్లు దండుకుని తీరా ఇప్పుడు ఉన్న ఉద్యోగులు పొట్ట కొట్టడం అత్యంత దారుణం. మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి మంచి ప్రజలకు నిత్యం ఎక్కడ గుర్తు ఉంటుందోనని చంద్రబాబు నాయుడి కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎం.డీ.యు వాహనాలను నిలిపివేయటాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)