నెల్లూరు జిల్లా మినీ మహానాడులో సందడి చేసిన కందుకూరు తెలుగు తమ్ముళ్లు

0

మినీ మహానాడులో సందడి చేసిన కందుకూరు తెలుగు తమ్ముళ్లు 

BSBNEWS - NELLORE

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో శుక్రవారం జరుగుతున్ననెల్లూరు జిల్లా మినీ మహానాడులో కందుకూరు తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయని, మినీ మహానాడులో ఆయా ప్రాంతాల్లో ఉన్న పలు విషయాలను తీర్మానాలు చేసి కడపలో జరిగే మహానాడులో ప్రాంతాలవారీగా ప్రవేశపెట్టే తీర్మానాలను ఆమోదించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకు వెళ్ళటం జరుగుతుంది అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మినీ మహానాడుకు కందుకూరు నుండి పాల్గొన్న వారిలో కందుకూరు టిడిపి పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, మండల అధ్యక్షులు నార్నే రోశయ్య, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు పొడపాటి మహేష్ తదితరులు ఉన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)