హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

0

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి 

BSBNEWS - కందుకూరు 

కందుకూరు పట్టణంలోని 26 వార్డు రజక పాలెం, అంకమ్మ గుడి వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.ముందుగా ఈ జయంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ హనుమంతుని ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా  ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, ప్రజలు భక్తులు, మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Post a Comment

0Comments
Post a Comment (0)