రామతత్వం వైపు నడిపించే శ్రీ రామ్నాథ్ గురువు ప్రవచనం
BSBNEWS - కందుకూరు
హనుమాన్ జయంతి సందర్భంగా కందుకూరు పెద్ద బజార్ లో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, చందనాలంకారం, ఆకు పూజ ఆలయ అర్చకులు శ్రీ రామచంద్రాచార్యులు వేదమంతాలతో పూజ నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీరామ శరన్ గురుదేవుల ప్రియ శిష్యులు శ్రీ రామ్నాథ్ బిరుదంకితులు పంగులూరు గోవిందరావు ప్రవచనము భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరామ తత్వం ఎంతో ప్రేమతో కూడుకుందని, రామాయణమంటే, బంధాలకు అనుబంధాలకు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత నిచ్చే ఆదికావ్యమని అన్నారు. శ్రీరాముని స్మరించిన ప్రతి ఒక్కరికి హనుమంతుని అనుగ్రహం ఉంటుందని గురూజీ తెలిపారు. శ్రీరామనాథ్ గురూజీ సాధన అనుష్టానం లో 16 కోట్ల రామనామ జపం పూర్తి చేశారు. రామ్నాథ్ అంతేకాకుండా 120 సార్లు రామాయణ పారాయణం చేసి 350 సార్లు సుందరకాండ పారాయణం 30 సార్లు భాగవత పారాయణం చేసి ఆ రామాయణంలోని రహస్యాలను బహిర్గతం చేస్తూ పంచామృత ధార పుస్తక ఆవిష్కరణ ఆయన చేశారని హనుమాన్ గురుస్వామి హనుమద్ ప్రసాద్ అన్నారు. అనంతరం శ్రీరామనాథ్ గురూజీని ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

