ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుక

0

ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుక

భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు...

BSBNEWS - కందుకూరు 

కందుకూరు పట్టణంలో తెలుగుజాతి కీర్తి పతాకం, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102 వ జయంతి  వేడుకలు   స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు, నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. టపాసులు, భాణాసంచా కాల్చుతూ భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహ కమిటీ కన్వీనర్‌, మాజీ పట్టణ టిడిపి అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అన్న  నందమూరి తారక రామారావు గారి 102 వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రపంచంలో  తెలుగువారు ఎక్కడున్నా బ్రతికున్నంత కాలం అన్న ఎన్టీఆర్ చిరస్మరణీయుడేనని కొనియాడారు. పేదలకు కూడు గుడ్డ రూపాయికే బియ్యం, తెలుగువారి ఆత్మగౌరవం అన్నీ అన్న నందమూరి తారక రామారావు పుణ్యమేనని తెలిపారు. కార్యక్రమం అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు, గోచిపాతుల మోషే,  నాదెళ్ల వెంకట రమణయ్య, వడ్డెళ్ళ రవిచంద్ర, మహర్షి శ్రీను, గొంది నరసింహారావు, రూబీ, జియా, పొన్నగంటి వెంకట్రావు, మొదడుగు వెంకటేశ్వర్లు,  కొత్తూరి వెంకట సుధాకర్, చక్క కేశవరావు, చీదెళ్ళ వేణు పోకూరి రాంబాబు, మేడ మల్లికార్జున, వెంకట కృష్ణ, మోసంగి ప్రసాద్, మంగపాటి శ్రీను, కిషోర్, మధిర మధు, కల్లూరి వెంకటేశ్వర్లు, బెల్లం వెంకటేశ్వర్లు,  ముప్పవరపు వేణు, మచ్చ మనోహర్, పొన్నగంటి వెంకటరావు, ఓరుగంటి రామ్మూర్తి, షేక్ మూస, పాలేటి కోటేశ్వరరావు,  వలేటి వెంకటేశ్వర్లు  ద్రాక్షాయిని పట్టణ, వార్డు అధ్యక్షులు, నాయకులు, నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)