మండవ మురళీకృష్ణ కు శివం ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం.
BSBNEWS
ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన పారిశ్రామికవేత్త సామాజిక సేవకులు మండవ మురళీకృష్ణను ఒంగోలు సంతపేటలోని శివం ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కాశీనాయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి శాలువాకప్పి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ తాను శివం ఫౌండేషన్ పెట్టడంలో మండవ మురళీకృష్ణ తోడ్పాటు ఎంతో ఉందని, వారితోపాటు ఇంకా ఎంతోమంది శ్రేయోభిలాషులు శివం ఫౌండేషన్ ఎదుగుదలకు తోడ్పాటు అందించారని, అటువంటి మండవ మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా ఎంపిక కావటం ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా శివం నిత్య అన్నదాన వాహనం ద్వారా ఒంగోలు నగరంలోని 300 మంది పేదలకు అనాధలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, గుండ్ల కమ్మ సాహితీ సేవా సమాఖ్య అధ్యక్షులు మండవ సుబ్బారావు, చౌదరి, మన్నం శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

