ఘనంగా జక్క వెంకన్న వర్ధంతి.

0

ఘనంగా జక్క వెంకన్న వర్ధంతి.

BSBNEWS - కావలి 

అమరజీవి కామ్రేడ్ జక్క వెంకన్న 7వ వర్ధంతి సందర్భంగా స్థానిక శివరామ సుబ్బయ్య భవనం సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వి మల్లికార్జున్ రావు, ఎస్ వెంకయ్య , జక్క వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మార్సిస్ట్ పార్టీ నిర్మాత బడుగు ,బలహీన, వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమంది పేదలకు భూములు పంచి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానీయుడు జక్క వెంకన్న లేని లోటు పేద ప్రజలకు మార్సిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు. దామరమడుగు గ్రామంలో జన్మించి మార్సిస్టు పార్టీ నిర్మాణం కొరకు వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి వ్యవసాయ కూలీల కొరకు ఎంతో కృషి చేశారని అంతేకాకుండా రెండుసార్లు అల్లూరు శాసనసభ్యునిగా గెలిచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపించేవాడని సమస్యల పరిష్కారం కొరకు ప్రజా ఆందోళన చేపట్టి జిల్లా ప్రజలకు త్రాగునీరు ,సాగునీటి కొరకు ఎంతో కృషి చేశారని అన్నారు. మార్సిస్టు పార్టీ ని ముందుకు తీసుకుపోవడమే వెంకన్న ఆశయమని అందుకు ప్రజా పోరాటాలను ముందుకు నడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్ వెంకయ్య, బి కిష్టయ్య, మేడ వెంకటేశ్వర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)