నూతల పాటి రమాదేవి మృతి

0

నూతల పాటి రమాదేవి  మృతి

BSBNEWS - గుడ్లూరు 

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామ సిపిఎం నాయకులు, రిటైర్డ్ వీఆర్వో నూతలపాటి వెంకటేశ్వర్లు సతీమణి రమాదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేటు వైద్యశాల చికిత్స పొందుతూ గురువారం  తుది శ్వాస విడిచారు.రమాదేవి సిపిఎం సానుభూతిపరురాలుగా, పార్టీకి సహాయ సహకారాలు అందించేవారని, పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు ఇంటికి వెళ్లిన ఆప్యాయంగా పలకరించేవారని, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, భోజనం వండి పెట్టే దాంట్లో ముందు ఉండేవారు..రమాదేవి  అంత్యక్రియలు, శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు,  తన స్వగ్రామం చేవూరు గ్రామంలో జరుగుతాయని, అనంతరం తన పార్టీవదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి దానం చేస్తారని. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు .

Post a Comment

0Comments
Post a Comment (0)