మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
BSBNEWS - కందుకూరు
దేవుని గడప కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు తరలివచ్చి కనీవినీ ఎరుగని విధంగా విజయవంతం చేసిన పసుపు సైనికులు, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. దార్శనిక నేత నారా చంద్రబాబు నాయుడు పై నమ్మకం, భావి తరపు నాయకుడు నారా లోకేష్ పై ఉన్న విశ్వాసం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీకి నిజమైన బలంగా నిలిచి మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా అభినందనలు. మహానాడు మహా సంబరాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా, కార్యకర్తలకు అసౌకర్యం కలుగకుండా నిర్వహించిన పార్టీ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు.

