చిరు వ్యాపారస్తులకే షాపులు కేటాయించాలి

0

చిరు వ్యాపారస్తులకే షాపులు కేటాయించాలి

BSBNEWS - కందుకూరు 

కందుకూరు అంకమ్మ దేవాలయానికి ఇచ్చిన మున్సిపల్ స్థలంలో శాశ్వత కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం టెండర్ల పిలుస్తున్న సందర్భంగా అమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వర రావు అఖిలపక్ష నాయకులతో కలిసి అంకమ్మ తల్లిని దర్శించుకుని మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గ్రామదేవతల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు తరతరాల నుంచి ఆ గ్రామ పూర్వీకులు భవిష్యత్ తరాలకు అందిస్తున్న వారసత్వపు ఆస్తిపాస్తులు అని అన్నారు. గ్రామ దేవతల నిర్వహణ అనాది నుంచి వస్తున్న పూజారులకు 29 దేవర్లు ఉన్న ఇంటిపేరు గలవాళ్ళకి అలాగే మిగతా మిరాశి దారులైన యాదవ, మంగలి, జంగం దేవర, చాకలి, బైండ్ల వాళ్లు, కొమ్ము వాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, బలిచ్చేవాళ్ళు వీళ్ళందరూ అంకమ్మ తల్లి ఆచార వ్యవహారాలను కాపాడుతున్న వారే వీళ్ళందరి అనుమతి లేకుండా అంకమ్మ తల్లిని ఎండోమెంట్లో పెట్టడమే గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం అని అన్నారు. అంకమ్మ తల్లి ఆలయ ఈవో తో మాట్లాడితే ఎలాంటి పద్ధతి లేకుండా ఈ కాంప్లెక్స్ కట్టే విధానాన్ని మొదలుపెట్టడం చూస్తుంటే అంకమ్మ తల్లి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్న ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా ముందుకి వెళ్ళిన పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. కందుకూరు అంకమ్మ దేవాలయం 29 దేవరలతో చుట్టుపక్కల గ్రామాలు అన్ని వర్గాలు కలిపి 45 రోజులు జరుపుకునే పెద్ద తిరునాళ్ళ అలాంటి తిరునాళ్ల సంప్రదాయం ఉన్న అంకమ్మ గుడిని దేవాలయ శాఖ పరిధికి తీసుకువచ్చినప్పటి నుంచి అంకమ్మ కి చేయాల్సిన సాంప్రదాయాలు అన్ని మరుగును బడిన పరిస్థితులతో పాటు తిరునాళ్లను కూడా ఆపేసిన పరిస్థితి అని అన్నారు 2016 లో జరిగిన తిరునాళ్ళు తరువాత అంకమ్మ గుడి దేవాలయ శాఖకు వెళ్లడంతో తిరుణాలను కూడా ఆపేసిన పరిస్థితి అని అన్నారు. ఇప్పుడు కొత్తగా అంకమ్మ గుడి నిర్వహణకు నిధులు కావాలి అని కొత్తగా కందుకూరు మున్సిపాలిటీ అమ్మవారికిచ్చిన స్థలంలో శాశ్వత కాంప్లెక్స్ పడుతున్న పరిస్థితి ని చూస్తే అమ్మవారి ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కడంతో పాటు తిరుణాలను కూడా మర్చిపోయే పరిస్థితి రాబోతుంది అని అమ్మవారిని కొలిచే అన్ని వర్గాలు బాధపడుతున్న పరిస్థితులలో ఈ దేశ మూల సంస్కృతిని కాపాడడం మనందరి బాధ్యతగా భావించి రేపు జరగబోయే టెండర్ల ప్రక్రియకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని అన్నారు. గ్రామ దేవతలు దేవాదాయ శాఖ పరిధిలోకి రావు కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కోర్టులో వేసి కందుకూరు అంకమ్మ గుడి ని దేవాదాయ శాఖ నుంచి విముక్తి కల్పించడానికి హైకోర్టులో వెళ్ళబోతున్న సందర్భంగా టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోయే మిత్రులందరికీ చెప్పదలుచుకున్నది రేపు అంకమ్మ గుడి దేవాదాయ శాఖ నుంచి కందుకూరు ప్రజలకు దక్కిన నాడు మీరు కట్టిన శాశ్వత నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా టెండర్లలో పాల్గొనడం అన్న ప్రక్రియకు దూరంగా ఉండవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అని అన్నారు. గత ప్రభుత్వం గుడికి ఏ విధంగా సంబంధం లేని వెంకట్ రెడ్డి కృష్ణా జిల్లాకు సంబంధించిన కొడాలి కోటేశ్వరరావు లాంటి వాళ్లను కమిటీ సభ్యులుగా నియమించి 2023లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే ఈ ప్రభుత్వం కొనసాగించడం అంటే ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి అని అన్నారు. గత ప్రభుత్వంలో వేసిన గుడికి సంబంధం లేని కమిటీ సభ్యులు ఈ ప్రభుత్వంలో కూడా ఆధిపత్యం చెలాయించడం చూస్తుంటే ఈ రెండు పార్టీలు పై స్థాయిలో  కలిసి పనిచేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి కందుకూరు అంకమ్మ గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కందుకూరు ప్రజలందరి మీద ఉంది అని చెప్పదలుచుకున్నాము అని అన్నారు. అంకమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తర్వాత అంకమ్మ గుడికి సంబంధించిన సాంప్రదాయాలు బదులు ఆలయ అధికారులు ఒక శాస్త్రీయత లేకుండా పల్లకి సేవలు అంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించడం అంటే ఈ దేశ మూల సంస్కృతికి జీవనాధారమైన గ్రామ దేవతల ఆచార వ్యవహారాలను లేకుండా చేసే కుట్రగా మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఇప్పటికైనా కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  ఒక రైతు బిడ్డగా గ్రామ దేవతల ఆచార్య వ్యవహారాలను అర్థం చేసుకుని కందుకూరు అంకమ్మ గుడిని దేవాదాయ శాఖ నుంచి  తప్పించడంతోపాటు అంకమ్మ తిరునాళ్లు జరగడానికి అవసరమైన మున్సిపాలిటీ ఇచ్చిన ఖాళీ స్థలాన్ని తాత్కాలిక షాపులు నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు. అంకమ్మ గుడి మీద ఆధారపడిన మిరాశిదారులైన అన్ని వర్గాలకు అంకమ్మ గుడి కమిటీలో స్థానం కల్పించే పేదలైన,ఆది ఆంధ్ర కాలనీ, బృందావన కాలనీ చాకలి, బైండ్ల వాళ్లు, కొమ్ముల వాళ్ళు, జంగం దేవర వాళ్లు మంగలి వాళ్లు  కుమ్మరి వాళ్లు, పోతురాజులు ఇలా అమ్మవారి సేవ చేసే ప్రతి వర్గం కి తాత్కాలిక్ షాపులు కేటాయించగలిగితే వీళ్ళందరూ అంకమ్మ గుడి నీ అంకమ్మ తిరునాళ్లను అంకమ్మ సాంప్రదాయాలను కాపాడుతూ మన గ్రామ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు ఇచ్చే పరిస్థితి ఉంటుందని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కన్వీనర్ నేతి మహేశ్వర రావు, కందుకూరు అభివృద్ధి మండలి ఉపాధ్యక్షులు పాలేటి కోటేశ్వరరావు, అభివృద్ధి మండలి సభ్యులు తోకల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నరేష్, వైఎస్ఆర్సిపి నాయకులు రఫీ, అంబేద్కర్ వాది మాజీ పిడిఎస్ యు నాయకులు  బి వెంకటేశ్వర్లు, యాదవ కుల నాయకులు మాధవ, ఆలయ పూజారులు ప్రభుత్వ చర్యలతో నిర్వాసితులవుతున్న అన్ని షాపులు వారు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0Comments
Post a Comment (0)