శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర

0

శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర 

BSBNEWS - కందుకూరు  


కందుకూరు పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర జరిగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్,కందుకూరు ఆర్ఎస్ఎస్ ఖండ సంఘచాలక్ డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కందుకూరు అంకమ్మ దేవాలయం వద్ద ఉన్న బజరంగి సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్, వెంకటనారాయణ బజార్, పోతురాజు మిట్ట, పామూరు సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదగా బజరంగ్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ తో శోభాయమానంగా సాగింది. దారి మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, అమరజీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బజరంగీ సెంటర్ ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు కళ్యాణ్ మిత్ర బృందం, హిందువులు, హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)