పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

0

 పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ 

- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

- 27 మంది బాధితులకు 24.56 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

BSBNEWS - కందుకూరు 


కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం 27 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 24.56 లక్షల రూపాయల చెక్కులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిది వరం లాంటిదని, రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల వైద్య విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాకుండా ఉండేటటువంటి జబ్బులకు వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్నారని, ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని  గెలిపించుకున్నందుకు ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. సీఎం సహాయం చెక్కులు అందుకున్న లబ్ధిదారులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహ, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, నాదేళ్ల వెంకట సుబ్బారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)