రమాదేవి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
BSBNEWS - గుడ్లూరు
మండలంలోని చేవూరు గ్రామంలో రిటైర్డ్ విఆర్ఓ నూతలపాటి వెంకటేశ్వర్లు భార్య రమాదేవి గురువారం మరణించారు. శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు రమాదేవి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పార్టీ నాయకులు పొట్టేళ్ల మురళి, కావలి ఏసుదాసు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

