యోగ శారీరకంగా మానసికంగా మనకు మేలు చేస్తుంది.
BSBNEWS- పొన్నలూరు
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం యోగేంద్ర కార్యక్రమం మూడవరోజు ఎంపీడీవో డాక్టర్ పి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యోగా సాధన చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా యోగ మనకు మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. యోగ ఆసనాలు చేయటం వల్ల కండరాల బలంగా మారుతాయి శరీరానికి వశ్యత పెరుగుతుందని మరియు సమతుల్యత కూడా మెరుగుపడుతుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ శ్రీదేవి శిక్షణ తీసుకునే ఆయా శాఖ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

