పేదలకు అన్నదానం చేసిన రాంబంటు స్వామి

0

పేదలకు అన్నదానం చేసిన రాంబంటు స్వామి

BSBNEWS - కందుకూరు 


 కందుకూరు సింహాద్రి నగర్ కు చెందిన కందుకూరు సబ్ డివిజనల్ సహకార సంఘ అధికారి కండ్రాతి వెంకట సుబ్బారావు( రాంబంటు స్వామి) తన తండ్రి కండ్రాతి గోపాలరావు 17వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాల నందు, విప్పిగుంట రోడ్డు నందు ఉన్న పేదలకు, జనార్ధన స్వామి ఆలయం వద్ద ఉన్న పేదలకు, పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రాంబంటు స్వామి మాట్లాడుతూ తన తండ్రి కండ్రాతి గోపాలరావు 17 వ వర్ధంతి సందర్భంగా పేదలకు ఉదయం ఆహారం పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మన ఇంట్లో శుభకార్యాలు జరిగిన, లేదా పెద్దవారి జ్ఞాపకార్ధాల రోజున మనతోపాటు పదిమంది పేదల ఆకలి తీర్చడం దైవ సేవతో సమానమని అన్నారు. మన తల్లిదండ్రులు కనిపెంచిన దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు, మనల్ని చిన్నప్పుడు నుంచి వారు అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించి మనల్ని సమాజంలో ఉన్నత స్థితికి తీసుకుని వచ్చారని అన్నారు. అటువంటి వారిని బ్రతికున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని, వారి మరణం తరం వారి జ్ఞాపకార్థం సేవ చేయటం బిడ్డలగా ప్రతి ఒక్కరి ధర్మం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేలపాటి మాల్యాద్రి (ఋషి చింతన దేవుడు ) పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)