ఎవరో వచ్చి చెప్పే మాయ మాటలను రైతులు నమ్మవద్దు

0

ఎవరో వచ్చి చెప్పే మాయ మాటలను రైతులు నమ్మవద్దు

పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది.

పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పిస్తాం

BSBNEWS - కందుకూరు  




ఎవరో వచ్చి చెప్పే మాయ మాటలను రైతులు నమ్మవద్దు అని కూటమి ప్రభుత్వం పొగాకు మద్దతు ధర కల్పిస్తుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పామూరు రోడ్ లో ఉన్న 27 వ నెంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సందర్శించి ధరల గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ గతంలో కిలో పొగాకు ప్రారంభం 230 నుంచి 300 వరకు ఉండేదని ప్రస్తుతం 280 నుంచి రాను రాను ధర తగ్గిపోతుందని  తెలిపారు. గత ఏడాది లోగ్రేడ్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని ప్రస్తుతం లోగ్రేడ్ కొనుగోలు చేయకపోవడంతో బోర్డుకు తెచ్చి తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నామని రైతులు ఎమ్మెల్యేతో తెలిపారు. రైతులు సమస్యలు విన్న ఎమ్మెల్యే కొనుగోలుదారులైన కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేయరన్న భయం రైతులలో ఉన్నదని పర్సంటేజీలు పెంచి అన్ని  రకాలుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చివరి ఆకు వరకు రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రైతులెవరు అధైర్యపడవద్దని  ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు, బయ్యర్లు, బోర్డు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పొగాకు కొనుగోలకు కృషి చేయాలని కోరారు. రైతులు బాగుంటేనే కంపెనీలు, కంపెనీలు బాగుంటేనే మీరు ఇలా ఒకరికి ఒకరు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే  రోశయ్య, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు  వలేటి నరసింహం, రమణయ్య, వడ్లమూడి రామకృష్ణ, అత్తంటి శ్రీహరి నాయుడు బోర్డు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)