మౌనిక స్టూడియో 30వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

మౌనిక స్టూడియో 30వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

మౌనిక స్టూడియోలో నూతన మినీ ప్రింటింగ్ మిషన్ ప్రారంభం

ఘనంగా స్వాగతం పలికిన నిర్వాహకులు

BSBNEWS - కందుకూరు 


 పట్టణంలోని పామూరు రోడ్డు నందు ఉన్న మౌనిక స్టూడియో, ఫ్లెక్స్ ప్రింటింగ్ 30 వ వార్షికోత్సవంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మౌనిక స్టూడియో పక్కనే ఉన్న శ్రీ కోదండ రామాలయం నందు జరిగిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. మౌనిక స్టూడియో లో నూతన మినీ ప్రింటింగ్ మిషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. స్టూడియో వారు ఏర్పాటుచేసిన  కేకును ఎమ్మెల్యే కట్ చేసి యాజమాన్యానికి వార్షికోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు ప్రజలందరి ఆదరాభిమానాలతో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇదేవిధంగా ఖాతాదారులకు మంచి సేవలందిస్తూ, వారి ఆదరాభిమానాలు చూరగొంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్టూడియో యజమాని అశోక్ ను వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నిర్వాహకులు మౌనిక స్టూడియో యజమాని ద్రోణాదుల అశోక్ ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నార్నె రోశయ్య, జనిగర్ల నాగరాజు, ఉన్నం లక్ష్మీనరసింహ, తెలుగుదేశం పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసులు, ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్, విపిజి సుకుమార్ గుప్తా, చక్కా కేశవ, తెలుగు మహిళలు కల్లూరు శైలజ, మన్నం శైలజ, అల్లం సుమతి, కంసాని మయూరి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)