దివ్యాంగులలో ఆత్మ విశ్వాసం కలిగించాలి

0

దివ్యాంగులలో ఆత్మ విశ్వాసం కలిగించాలి

BSBNEWS - KANDUKUR 

దివ్యాంగులలో ఆత్మ విశ్వాసం కలిగించాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ అన్నారు. కందుకూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు బొమ్మ వద్ద సక్షమ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకికళ్ళను, వినికిడి మిషన్ లు కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాల ద్వారా వారికి తోడుగా ఉంటుందని అన్నారు. దివ్యాంగులపై మనం చూపించాల్సింది జాలి కాదని వారిలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో ఉన్న భయాన్ని, అధైర్యాన్ని తొలగించి వారిలో ధైర్యాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ వారితో మలచుకోవాలని ఆమె అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు సక్షమ్ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు పట్టణ ఎస్సై పి.శివ నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమం చేయాలని ఉంటుందని కానీ సేవా కార్యక్రమం అందరూ చేయలేరని  అయితే కొంతమంది దృఢ సంకల్పంతో సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారని వారిని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సక్షమ్ సేవా సంస్థ వారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి తీసుకునాన్నని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సేవతో కూడిన మంచి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అన్నారు. అనంతరం పలు సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని శాలువతో సన్మానించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)