సిపిఐ నియోజక వర్గ మహాసభలను జయప్రదం చేయండి
BSBNEWS - KANDUKUR
ఈనెల 25న సిపిఐ కందుకూరు నియోజకవర్గ 4వ మహాసభ జరుగుతుందని ఈ మహా సభలను విజయవంతం చేయాలని కందుకూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూసి సురేష్ బాబు పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా బుధవారం ఓలేటి వారి పాలెం లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సిపిఐ నియోజకవర్గ మహాసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు పామూరు రోడ్డు లోని లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలకు సిపిఐ కార్యాలయం నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని ఈ ప్రదర్శనలో పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. నెల్లూరు జిల్లా మహాసభలు ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో నెల్లూరు నగరంలో జరుగుతాయని, సిపిఐ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20 నుండి 25 వరకు ఒంగోలు నగరంలో జరుగుతున్న ఉన్నాయని రాష్ట్ర జిల్లా మహాసభలను సైతం విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర మహాసభలు సందర్భంగా శాఖ, మండల, నియోజకవర్గ, జిల్లా మహాసభలు పూర్తి చేసుకోవటం జరుగుతుందని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి పి బాలకోటయ్య, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద్ మోహన్, నాయకులు బాల బ్రహ్మచారి, కే మురళి, సిపిఐ వలేటి వారి పాలెం శాఖ సభ్యులు పిన్నిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు

