నలదలపూరులో క్షేత్రదినోత్సవం

0

నలదలపూరులో క్షేత్రదినోత్సవం

BSBNEWS - వలేటివారిపాలెం



27వ పొగాకు బోర్డు పరిధిలోని  నలదలపూరులో మంగళవారం సిరి - ఎఫ్ సి ఆర్-15 వంగడాల మధ్య ఉత్పత్తి, నాణ్యతలో పోలిక అనే అంశం మీద రైతులకు, సిబ్బందికి వేలం నిర్వహణ అధికారి బి.చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుగు ఆకులు వొదిలేసి పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే రెలచాలి అని అన్నారు. ఆకు అల్లిక సమయంలో టార్పాలిన్ పట్టాలు విడిగా వాడాలి అన్నారు. గ్రేడింగ్ సమయంలో బుట్టలను  అందుబాటులో ఉంచుకొని అన్యపదర్థాలను అందులో వేయాలని చెప్పారు. బారన్లో కురోమీటర్ ఉపయోగించాలన్నారు. దీనివలన అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. బ్యారెన్ లో క్యురింగ్ సమయంలో తీసుకోవలసిన మెలుకువలు, క్యూరింగ్, గ్రేడింగ్  అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, పొగాకులో అన్యాపదర్ధాలు కలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు సవివరంగా వివరించారు. సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ రాజా గోపాల్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికత వైవు దృష్టి సాధించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులతో  పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలును సూచించారు. ఐ.టి.సి ప్రతినిదులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సిరి ఎఫ్ సి ఆర్ -15 వంగడాల మధ్య పోలికలు గురించి క్లుప్తంగా వివరించారు. జి.పి.ఐ ప్రతినిధి సుబ్బా నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఓడి దుడుకులు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు సిబ్బంది, నలదలపూరు రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)