ఉగాదికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

0

ఉగాదికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

BSBNEWS - ఒంగోలు


ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యము, స్వమిత్వ సర్వే, ఇంటి పన్నుల వసూలు, అక్షర ఆంధ్ర, విద్యా, వైద్యం, డ్వామా, పంచాయతీరాజ్ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన్మన్, పి.ఎం.ఏ.వై.-2.0 పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలలో కూడా వేగం పెంచాలని స్పష్టం చేశారు. సచివాలయాల సిబ్బందితో చేయిస్తున్న సర్వేలను కూడా ఈ నెలాఖరు నాటికి ముగించాలన్నారు. ఇంటి పన్నుల వసూలులో లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు హెల్త్ చెకప్స్ చేయాలని, వారిని పబ్లిక్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేలా ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను రెగ్యులర్ గా సందర్శించాలని ఆయన చెప్పారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను సమర్ధంగా వినియోగించుకునేలా పెండింగ్ పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, డ్వామా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డీఈవో రేణుక, ఆర్.ఐ.ఓ. ఆంజనేయులు, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డ్వామా పీ.డీ. జోసఫ్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్.ఈ. అశోక్, డిఆర్డిఏ పిడి నారాయణ, సిపిఓ సుధాకర్ రెడ్డి, సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్తమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)