జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ హవా

0



 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో  బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ హవా

BSBNEWS - కందుకూరు


సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ (2026) సెషన్-1 ఫలితాలలో కందుకూరు బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ ఐఐటి & మెడికల్ అకాడమీ

జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటి జిల్లాలోనే అత్యుత్తమ పర్సంటైల్స్ సాధించి గర్వకారణంగా నిలిచారని బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు తెలిపారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ పర్సంటైల్స్ సాధించిన మా విద్యార్థులు బొల్లినేని కార్తీక్ నాయుడు జిల్లాలోనే అత్యుత్తమంగా

టౌన్ లో మొదటి స్థానంలో (99.76) పర్సంటైల్ సాధించాడని తెలిపారు. మానికొండ హర్షిత్ చౌదరి (98.96), ఆర్.యశస్వి కుమార్ (96.54), పి.లోకేష్ (94.52), ఎన్.వి.అర్యేంద్ర (93.38), కె.శశికళ (92.88),

ఆర్.నాగ సాయి (92.22), సి హెచ్. భవ్యశ్రీ(91.94), ఎల్. లిఖిత సాయి శ్రీ (91.69), జి.రాజేశ్వరి (90.11), ఆర్. తరుణ్ (89.88), ఎస్.వాసవి (89.83) పర్సంటైల్స్ తో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఆయన తెలిపారు. జేఈఈ అడ్వాన్స్డ్ కి 30 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కరరావు, బి.నరేంద్ర బాబు, ప్రిన్సిపాల్స్ అబ్బూరి వెంకటేశ్వర్లు, షాహుల్ హమీద్, ఇర్ఫాన్, వెంకటరావు, ఇంచార్జి వెంకారెడ్డి, తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)