విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన డి.ఎస్.పి

0

 విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన డి.ఎస్.పి





(ఉలవపాడు) ఫిబ్రవరి 6:
మండలంలోని వీరేపల్లి ఏపి మోడల్ స్కూల్


లో విద్యార్థులకు చట్టాలు,  సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, రోడ్డు భద్రత, మహిళలపై జరిగే నేరాలు, వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కందుకూరు డీఎస్పీ సిహెచ్ వి బాలసుబ్రమణ్యం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభం అవుతుంది. ప్రతి విద్యార్థి మంచి విషయాలను తెలుసుకొని సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి చేతికి సెల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని అందులో మంచి విషయాలతో పాటు తమ భవిష్యత్తుకు అవసరమైన వాటిని మాత్రమే వినియోగించుకోవాలని, చెడు వ్యసనాలకు, అనవసరమైన విషయాలపై విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. సైబర్ నేరాల బారిన పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థు లు దూరంగా ఉండాలని ఆయన కోరారు. మోటర్ వాహనాలపై నించేటప్పుడు నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. యువత తలుచుకుంటే దేశాన్ని సైతం మార్చగల శక్తి ఉంటుందని దానిని మంచి మార్గంలో మలుచుకుంటూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా పలుచుకోవాలని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి ప్రతినిత్యం చేస్తున్న పనులను సైతం ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్సై సుబ్బారావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)