వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.రాజబాబు

0

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.రాజబాబు 


BSB-NEWS


ఒంగోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర మంత్రులు, కార్యదర్సులతో  కలసి స్వర్ణాంధ్ర@2047 విజన్ లో భాగంగా   రాష్ట్ర ప్రభుత్వం సంజీవని ప్రాజెక్ట్, ఏఐ ఆధారిత వ్యవసాయం, విద్యా, ఆరోగ్య రంగాలలో చేపట్టిన ప్రాజెక్టులపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ తో కలిసి చర్చించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో వారి బృందం ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.     రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆర్టీజిఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ కు వివరించారు. ప్రాజెక్ట్ సంజీవని అమలుకు గేట్స్ ఫౌండేషన్ ఏఐ సాంకేతిక సహాయం అందించనున్నట్లు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తెలిపారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  వర్చువల్ గా  జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)