రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

0

 రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

మంత్రి స్వామి 

సింగరాయకొండ)


జాతీయ రహదారి 16 పై సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ, నియంత్రణకి జాతీయ రహదారి పర్యవేక్షణ శాఖ, పోలీస్ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆకస్మికంగా 16 వనంబర్ జాతీయ రహదారి ని   పరిశీలించి కనుమళ్ళ రోడ్డు కూడలి వద్ద రోడ్డు ప్రమాదాల గురించి పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఆప్రాంతాన్ని పరిశీలిస్తూ నిత్యం ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో స్టడీ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై వాహన చోదకులు, వాహనదారులు ఎక్కడ బడితే అక్కడ రోడ్డు దాటకుండా నియంత్రించాలని ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేయడం, బారికాడ్స్ ఏర్పాటు చేయడం చెయ్యాలని పోలీస్ అధికారులకు సూచించారు. కనుమళ్ళ రోడ్డు కూడలి రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని దానికి ఎన్ హెచ్ 16 శాఖ, ఆర్ టి ఒ, పోలీస్ శాఖల అధికారులు సమీక్షించి  సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, వాహన చోదకులు వాహనదారులు ప్రాణం విలువ తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ రహదారి దాటే సమయంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాట కుండా రోడ్డు భద్రత సూచికలు నిర్దేశిక బోర్డు గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే రోడ్డు దాటాలని మంత్రి హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య, ఎస్సై బండ్లమూడి మహేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)