విజయవాడ తరలివెళ్లిన సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు

0

 విజయవాడ తరలివెళ్లిన సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు 


bsbnews - kandukur


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల రాష్ట్రస్థాయి సమావేశం గురువారం మధ్యాహ్నం అమరావతిలో జరగబోతోంది. మన నీరు - మన భవిష్యత్తు సాగునీటి సంఘాల పాత్ర అనే అంశంపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గంలోని 45 సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కందుకూరు నుండి రెండు బస్సుల్లో అమరావతికి బయలుదేరి వెళ్లారు. 

కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, స్థానిక టిడిపి కార్యాలయం దగ్గర జెండా ఊపి బస్సులను సాగనంపారు. ఈ కార్యక్రమంలో రాళ్లపాడు సాగునీటి సంఘం అధ్యక్షులు  ఏలూరు వెంకటేశ్వర్లు, విఆర్ కోట ఆనకట్ట నీటి సంఘం అధ్యక్షులు తలపనేని రవీంద్రబాబు, రాళ్లపాడు  ఈఈ మునిరత్నం, డిఈలు హజరత్, వెంకటేశ్వర్లు, జేఈలు వినోద్, సీతారామయ్య, మనోహర్, అన్నక్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)