అట్టహాసంగా పాకల బీచ్ రీల్ ఆవిష్కరణ

0

 అట్టహాసంగా పాకల బీచ్ రీల్ ఆవిష్కరణ


BSB-NEWS

ఒంగోలు


ఈనెల 14, 15 తేదీలలో సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో నిర్వహించే ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించిన ప్రమోషన్ రీల్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి నగరంలో అట్టహాసంగా జరిగింది. అద్దంకి బస్టాండు సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ కె. వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో నిర్వహించే ఈ ఉత్సవములో కుటుంబసమేతంగా పాల్గొనాలని జిల్లా ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా వివరించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)