సూపర్వైజర్, కార్యకర్తలకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి
ఆదేశించిన ఫుడ్ కమిషన్ సభ్యులు
BSB-NEWS
కొరిశపాడు
బుధవారం కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో బి.సి కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు ఇండేల లక్ష్మీ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 వ తారీఖు నుండి పిల్లలకి పాలు ఇవ్వటం లేదని, రెండు రోజులు నుండి కోడి గుడ్లు ఇవ్వటం లేదని ఆయన గుర్తించారు. ఈ విషయం పై అంగన్వాడీ టీచర్ అనురాధను ఆయన వివరణ అడగగా ఇంకా స్టాక్ రాలేదని చెప్పటంతో టైమ్ టు టైం స్టాక్ తెప్పించి ఇవ్వటం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. మెనూ కూడా అమలు చేయలేదని, ఈ విషయంపై సూపర్ వైజర్ అరుణ దేవిని అడగగా ఆమె కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోనీ, పిల్లలు, బాలింతల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ఇంత పెద్ద మొత్తం లో ఖర్చు చేస్తుంటే మీరు నిర్లక్ష్యం చేయటం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులకు మీరు తూట్లు పొడవొద్దన్నారు. నిర్లక్ష్యం వహించిన సూపర్ వైజర్ అరుణా దేవికి, టీచర్ అనురాధకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సి.డి.పి.వో ఎలిజబెత్ రాణిని ఆదేశించారు.
బొడ్డువానిపల్లిలో
బొడ్డువానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. స్వయంగా విద్యార్థులకి భోజనం వడ్డించి ఆయన కూడా రుచి చూసి బాగుందని కితాబిచ్చారు. ఇలానే మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆయన చెప్పారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. కోడి గుడ్లు స్టాక్ ఎక్కువ ఉండటం గమనించారు. ఒక సెంటర్ లో 93 గుడ్లు ఎక్కువగా ఉండటం,
రెండవ కేంద్రంలో 30 గుడ్లు జనవరి నెల వి ఉండటం పై ఆయన వారిని వివరణ అడగగా సమాధానం చెప్పలేదని ఇద్దరూ టీచర్లకు, సూపర్ వైజర్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సి.డి.పి.వో నీ ఆయన ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయన వెంట డి.ఎస్.వో పద్మ, డి.ఎం సివిల్ సప్లైస్ అధికారి వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత, ఫుడ్ సేఫ్టీ అధికారి మహమ్మద్ సంశీర్ ఖాన్, సి.డి.పి.వో తదితర అధికారులు పాల్గొన్నారు.
